* ఐలమ్మ స్పూర్తిని మా ప్రభుత్వం కొనసాగిస్తుంది
* ఐందిరాగాంధీ తెచ్చిన భూ సంస్కరణలకు ఐలమ్మ పోరాటమే స్పూర్తి
* ఐలమ్మ కుటుంబ సభ్యులు మా ప్రభుత్వంలో భాగస్వామలు కావాలనుకుంటున్నాం
* మహిళా కమిషన్ సభ్యురాలిగా ఆమె మనుమరాలు శ్వేత నియామకం
* ఐలమ్మ 39వ వర్ధంతి సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన
ఆకేరున్యూస్, హైదరాబాద్ : గడీలలో గడ్డి మొలవాలి అనే నినాదం ఇచ్చిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తి చాకలి ఐలమ్మ పేరును హైదారాబాద్ లోని కోఠి మహిళా యూనివర్శిటీకి పెడుతున్నామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో మంగళవారం నిర్వహించిన చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాకారులు ప్రదర్శించిన ప్రత్యేక నృత్య రూపకాన్ని తిలకించారు. అనంతరం కళాకారులను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దొరల చేతుల్లో ఉన్న వేలాది ఎకరాల భూమి పేదలకు చేరాలని ఐలమ్మ పోరాటం చేశారని, ఆమె పోరాట స్ఫూర్తితోనే అప్పటి దివంగత ప్రధానమంత్రి ఐందిరాగాంధీ భూ సంస్కరణలను తీసుకొచ్చారని గుర్తుచేశారు. ఐలమ్మ కుటుంబ సభ్యులు మా ప్రభుత్వంలో భాగస్వామలు కావాలనుకుంటున్నామని తెలిపారు. దీనిలో భాగంగా మహిళా కమిషన్ సభ్యురాలిగా ఆమె మనుమరాలు శ్వేతను నియమిస్తున్నట్లు ప్రకటించారు. పీవీ నరసింహారావు భూ సంస్కరణలను అమలు చేయడం వల్లనే తెలంగాణ లోని లక్షలాది పేదలకు భూ యాజమాన్య హక్కు వచ్చిందన్నారు.
———————————–