* గంటకు 250 కిలోమీటర్ల వేగం
* ఏడు గంటల పాటు ఆకాశంలోనే ఉండగలగడం దీని ప్రత్యేకం
ఆకేరున్యూస్, బెంగుళూరు : స్వదేశీ పరిజ్ఞానంతో తొలిసారిగా రూపొందించిన మానవ రహిత బాంబర్ విమానం ఎఫ్డబ్ల్యూడీ 200బీ విజయవంతంగా గగణ విహారం చేసింది. బెంగుళూరుకు చెందిన ఫ్లయిండ్ వెడ్జ్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ (ఎఫ్డబ్ల్యూడీఏ) సంస్థ దీన్ని రూపొందించింది. ఈ విమానం సుమారు 15వేల అడుగుల ఎత్తులో ఏడు గంటల పాటు ఆకాశంలోనే ఉండగలగడం దీని ప్రత్యేకం. ఇది నిఘాకోసం ఆప్టికల్ పరికరాలు, గగనతల దాడులు, బాంబింగ్ కోసం క్షిపణి తరహా ఆయుధాలను మోసుకెళ్తుంది. దీని ఏరోడైనమిక్స్ డిజైన్, ఎయిర్ ఫ్రేం, ప్రొపల్షన్, నియంత్రణ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్స్ ను ఎఫ్డబ్ల్యూడీఏ కర్మాగారంలోనే రూపొందించారు. ఈ విమానం బరువు 102 కేజీలు, గరిష్టంగా 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల సామర్థ్యం దీని సొంతం.
————————
Please tell us what is wrong. Your report will be sent to the website team.
