* పెద్దోళ్లకు నామ్‌కే వాస్తేగా నోటీసులు
* పేదోళ్ల ఇంటికి డైరెక్టర్ గా బుల్డోజర్లు
* కేసీఆర్ అన్నా.. కాపాడాలని బాధితులు కోరుతున్నారు..
* ప్రజలందరూ కేసీఆర్ మళ్లీ రావాలని కోరుకునే రోజు ఎంతో దూరం లేదు
* దమ్ముంటే వాళ్లను పార్టీలో చేర్చుకున్నామని రేవంత్ చెప్పాలి
* గాంధీకి కండువా కప్పిన సన్నాసి ఎవరు?
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి(Cm Revanthreddy)పై బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(Ktr) మండిపడ్డారు. అలాంటి చిట్టినాయుడులకు అధికారంలో ఉండే అర్హత లేదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి చేర్చుకుని ఇప్పుడు వాళ్ల బతుకు జూబ్లీ బస్టాండ్ చేశారని ఎద్దేవా చేశారు. హైకోర్టు(Hicourt) తీర్పుతో రేవంత్‌కు భయం ఏర్పడిందన్నారు. హైదరాబాద్‌లో బీఆర్ ఎస్ కార్యకర్తలు, నేతలతో మాట్లాడిన కేటీఆర్ వారికి భరోసా ఇచ్చారు. హైడ్రా బాధ , ఏ బాధ కలిగినా తాను అండగా ఉంటానని, క్షణాల్లో మీ వద్ద వాలిపోతానని భరోసా ఇచ్చారు. చాలా మంది బీఆర్ ఎస్ లోకి తిరిగి వస్తామని కోరుతున్నారని, వారిలో మంచివాళ్లు ఉంటే ఆలోచూద్దామని తెలిపారు.
పేదోళ్ల ఇంటికి డైరెక్టర్ గా బుల్డోజర్లు
సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి(Cm Brother Tirupathireddy) ఇల్లు కూడా ఎఫ్టీఎల్(Ftl) పరిధిలో ఉందని, ఆ ఇంటిపైకి వెళ్లే దమ్ము హైడ్రాకు లేదని విమర్శించారు. ఎందుకంటే చుట్టూ మందీమార్బలం, అంగ, అర్థబలం ఉంది కదా అని తెలిపారు. బీఆర్ ఎస్ ఓళ్లు గొడవ చేస్తారని నామ్ కే వాస్తేగా నోటీసు ఇచ్చారని తెలిపారు. అదే పేదోళ్ల ఇంటికి తెల్లవారుజామునే డైరెక్ట్ గా బుల్డోజర్లు వెళ్లిపోతాయని తెలిపారు. బాధితులు అందరూ మాజీ సీఎం కేసీఆర్ (Ex Cm Kcr)రావాలని కోరుకుంటున్నారని, ప్రజలు అందరూ కోరుకునే సమయం ఎంతో దూరం లేదని వెల్లడించారు.
గాంధీకి కండువా కప్పిన సన్నాసి ఎవరు?
బీఆర్ ఎస్ ఎమ్మెల్యేల ఇంటింటికీ వెళ్లి వారిని రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లోకి చేర్చుకున్నారని, ఇప్పుడు మా పార్టీలో లేరని చెబుతున్నారని విమర్శించారు. వారిని మా పార్టీలో చేర్చుకున్నామని, ఎన్నికల్లో పోటీ చేసి గెలిపించుకుంటామని చెప్పాలని దమ్ముంటే రేవంత్ తెలపాలని సవాల్ విసిరారు. ఇప్పుడు ఆ పది ఎమ్మెల్యేల బతుకు జూబ్లీ బస్టాండ్ అయిందని విమర్శించారు. బీఆర్ ఎస్ ఎమ్మెల్యేల మధ్య పంచాయితీలోకి మమ్మల్ని లాగొద్దని శ్రీధర్ బాబు(Sridharbabu) అతితెలివిగా మాట్లాడుతున్నారని, గాంధీకి కండువా కప్పిన సన్నాసి ఎవరని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పుతో రేవంత్ రెడ్డికి భయం మొదలైందన్నారు.
…………………………………..