* ముడా స్కాంలో పిటిషన్ ను కొట్టేసిన కర్ణాటక హైకోర్టు
* కేసు విచారణను జరిపించాలని గవర్నర్ ఉత్తర్వులను సమర్థించిన కోర్టు
ఆకేరు న్యూస్ డెస్క్ : కర్ణాటక హైకోర్టులో సీఎం సిద్దారామయ్య(Cm siddaramayya)కు చుక్కెదురైంది. ముడా స్కాం(Muda Scam) కేసులో విచారణను నిలిపేయాలని సిద్దారామయ్య వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. కేసు విచారణను జరిపించాలని గవర్నర్ ఉత్తర్వులను సమర్థించింది. దీంతో ముడా స్కాంలో సిద్దారామయ్య విచారణను ఎదుర్కొనే అవకాశం ఉంది. హైకోర్టు(Hicourt) నిర్ణయంపై సిద్దారామయ్య సుప్రీంకోర్టు(Suprim Court)ను ఆశ్రయించే అవకాశం ఉంది. తీర్పుపై రివ్యూ పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. విలువైన ప్రభుత్వ భూములను సిద్దారామయ్య కుటుంబసభ్యులకు అతిచౌకగా కట్టబెట్టారని ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సీఎం పదవిలో కొనసాగుతూనే సిద్దారామయ్య న్యాయ విచారణను ఎదుర్కొంటారని మంత్రులు చెబుతున్నారు. కాసేపట్లో మంత్రులతో సీఎం సమావేశం అయ్యే అవకాశం ఉంది.
………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
