
* కొండా మురళి మరోసారి హాట్ కామెంట్స్
* పోటా, టాడా కేసులకే నేను బెదరలేదు.
* మీనాక్షి నటరాజన్‌తో కొండా దంపతుల భేటీ
* 16 పేజీల నివేదిక అందజేత
ఆకేరు న్యూస్, వరంగల్ : కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నాటరాజన్‌ను మంత్రి కొండా సురేఖ దంపతులు ఈరోజు కలిశారు. హైదర్ గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో వారి భేటీ జరిగింది. ఉమ్మడి వరంగల్ లో పార్టీ పరంగా జరుగుతున్న పరిణామాలపై వారు మీనాక్షి నటరాజన్‌కు 16 పేజీల నివేదికను అందజేశారు. శనివారం గాంధీ భవన్‌కు వచ్చి లిఖిత పూర్వకంగా వివరణ ఇచ్చిన మురళి ఈరోజు మీనాక్షి నటరాజన్ ను కలవడం చర్చనీయాంశంగా మారింది. పార్టీలో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మీనాక్షీ నటరాజన్‌కు తెలియజేశారు. అదేవిధంగా.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నియోజకవర్గాల వారిగా రిపోర్టును అందజేశారు. తాము రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చామని, నిజాలు తెలుసుకున్న తరువాత ఎవరిది తప్పుంటే వాళ్లపై చర్యలు తీసుకోమని కొండా దపంతులు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జికి విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది.
నా ఎపిసోడ్ 44 ఏళ్ల నుంచి నడుస్తోంది
ఇదిలాఉండగా అంతకుముందు మురళి మీడియాతో మాట్లాడుతూ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. తాను ఎవరికీ భయపడబోనని, వెనకబడిన వర్గాల ప్రతినిధినని వెల్లడించారు. 44 ఏళ్ల నుంచి నా ఎపిసోడ్ నడుస్తూనే ఉందన్నారు. ఒకరి గురించి తాను కామెంట్ చేయనని, తనను ఉంటే ఊరుకోనని హెచ్చరించారు. తనకు ప్రజా బలం ఉందన్నారు. తాను భయపడకపోతే నాపై 23కేసులు పెట్టకపోయేవాళ్లు. పోటా, టడా కేసులకే భయపడలేదన్నారు.
…………………………………………..