
మంత్రి ధనసరి అనసూయ సీతక్క
ఆకేరు న్యూస్, హనుమకొండ : బీసీ బిల్లు సభలో ప్రవేశ పెట్టి ఆమోదం తెలిపినందుకు గర్వంగా ఉందని మంత్రి సీతక్క ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. తమ నాయకుడు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు సీఎం రేవంత్ రెడ్డి కి ఉన్న చిత్తశుద్ది తో చారిత్రాత్మకమైన బీసీ బిల్లుకు ఆమోదం పొందడం
గర్వంగా ఉందని సీతక్క పేర్కొన్నారు. గతంలో బీసీలకు కేవలం 23 శాతం మాత్రమే రిజర్వేషన్లు అమలులో ఉండేవని సీతక్క పేర్కొన్నారు. బీసీ జనాభా నిష్పత్తి మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటింటి సర్వే నిర్వహించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను తీసుకొచ్చిందని సీతక్క పేర్కొన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మకమైన నిర్ణయం అని సీతక్క పేర్కొన్నారు.
………………………………………