* పిల్లల మీద ఒట్టేసి చెబుతున్నా…అదంతా అబద్దం
* జగన్ తన సైతాన్ సైన్యంతో దుష్ప్రచారం
* ఆదానీతో చంద్రబాబు బంధం తెంచుకోవాలి
* మీడియా సమావేశంలో పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల
ఆకేరున్యూస్, అమరావతి: ప్రభాస్ ఎవడో తనకు ఇప్పటికీ తెలియదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (SHARMILA) స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి (JAGANMOHAN REDDY) తన సైతాన్ సైన్యంతో ప్రభాస్‌తో తనకు సంబంధం ఉన్నట్లు ప్రచారం చేయించారని ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ (LOTUS POND) లో జగన్ మోహన్ రెడ్డి, ఆదానీలపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను ప్రభాస్ అనే వ్యక్తిని ఇంతవరకూ చూడలేదు. నా బిడ్డలపై ప్రమాణం చేసి చెబుతున్నా, ప్రభాస్ ఎవడో నాకు ఇప్పటికీ తెలియదు. ఆయనతో నాకు ఎలాంటి సంబంధం లేదు. జగన్‌కు ఇవ్వన్నీ తెలిసి కూడా, నాకు వ్యక్తిత్వం లేనట్లు ప్రచారం చేయించారు. ప్రభాస్‌తో సంబంధం ఉన్నట్లు గత ఐదేళ్లుగా జగన్ తన సైతాన్ సైన్యంతో సోషల్‌విూడియా వేదికగా విమర్శలు చేయించింది నిజం కాదా? విూకు చెల్లెలిపై ప్రేమ ఉందా? అసలు విూకు సిగ్గు ఉందా?మళ్లీ నా వీడియోనే ప్లే చేసి, విూకు మైలేజీ వచ్చేటట్లు వాడుకుంటున్నారు.
ఏపీ మాజీ సీఎం జగన్‌కు పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ రూ.1,750 కోట్ల లంచం ఇచ్చినట్లు అమెరికా ఏజెన్సీల దర్యాప్తులో వెల్లడైన నేపథ్యంలో శుక్రవారం శర్మిల విలేకరులతో మాట్లాడారు. జగన్ బాటలో ఏపీ సీఎం చంద్రబాబు నడవొద్దు. ఇక విూదట ఏపీ నుంచి అదానీకి ప్రాజెక్ట్స్ ఇవ్వొద్దు. మోదీ అదానీ వేర్వేరు కాదు. మోదీ అండతోనే దేశంలో ఇంత అవినీతి జరుగుతుందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా అదానీనీ బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలి. ఒక సహచరిగా రేవంత్‌కు విజ్ఞప్తి చేస్తున్నాను.. అదానీతో బిజినెస్ చేయొద్దు. నేను జగన్మోహన్ రెడ్డినీ ఎత్తి చూపకపోతే నా ఆస్తి నాకు ఇస్తానని అంటున్నారు. కానీ నేను మాట్లాడకుండా ఉండలేను. నేను కాంగ్రెస్ పార్టీ చీఫ్… ఇలాంటివి నేను మాట్లాడకుంటే ఎలా అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.
………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
