* రైతులు ప్రతిపక్షాల ట్రాప్‌లో పడొద్దు
* సీఎం రేవంత్ రెడ్డి
* రుణమాఫీపై చర్చకు సిద్ధమా అని ప్రధానమంత్రి, బీఆర్ఎస్ అధినేతకు సవాల్
ఆకేరున్యూస్, మహబూబ్‌నగర్: రైతు బిడ్డగా రైతుల కష్టాలు తనకు తెలుసునని తెలంగాణ (TELANGANA) ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ( REVANTHREDDY) తెలిపారు. రైతులు ప్రతిపక్షాల ట్రాప్‌లో పడొద్దని.. రుణమాఫీపై చర్చకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ (NARENDRAMODI) , బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) సిద్ధమా అని సవాల్ విసిరారు. శనివారం మహబూబ్‌నగర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం రేవంత్ (REVANTHREDDY) పాల్గొని ప్రసంగించారు. రైతుల కోసం రూ.54 వేల కోట్లు ఖర్చు పెట్టామని.. ఇంకా కేటాయించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
వరి రైతులకు పండుగ..
కాంగ్రెస్ ప్రభుత్వం వరి వేస్తే.. రూ.500 బోనస్ ఇచ్చి.. వరి రైతులకు పండుగ తెచ్చిందనన్నారు. కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరానికి రూ.1.02 లక్షల కోట్లు ఖర్చు చేసినా.. మూడేళ్లు నిండకుండానే కాళేశ్వరం కూలిందని విమర్శించారు. దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రుణమాఫీ చేశామని.. 25 లక్షల రైతు కుటుంబాలకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశామని గుర్తుచేశారు. సాగుకు ఉచిత కరెంట్ పేటెంట్ హక్కు కాంగ్రెస్‌దేనని గుర్తు చేశారు.
మాయగాళ్ల మాటలు వినొద్దు..
‘‘గతంలో ఎవరూ భూసేకరణ చేయలేదా. …ప్రాజెక్టులు కట్టలేదా.. పరిశ్రమలు నిర్మించలేదా. నా జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసి.. ప్రజలకు ఉపాధి కల్పించాలని భావించానని.. మాయగాళ్ల మాటలు విని పరిశ్రమలను అడ్డుకుంటూ.. మాయగాళ్ల మాటలు విని లగచర్ల ప్రజలు కేసుల్లో ఇరుకున్నారన్నారు. మాయమాటలు నమ్మి అభివృద్ధిని అడ్డుకోవద్దన్నారు. భూములు కోల్పోతున్నవారు పరిహారం అడగండి ఇస్తానని… కావాలంటే ఎకరాకు రూ.20 లక్షల పరిహారం అయినా ఇసామని సీఎం అన్నారు.
…………………………………..