* మీరూ ఓ మొక్క నాటండి
* మన్ కీ బాత్లో ప్రధాని మోదీ
* లోక్సభ ఎన్నికల తొలి కార్యక్రమం
ఆకేరు న్యూస్ డెస్క్ : “నేనో మొక్క నాటాను. మా అమ్మకు గుర్తుగా. ప్రజలందరూ ఇలాగే తల్లులను గౌరవించండి. మొక్కనాటి (Plant the plant) వారిపై ప్రేము చూపండి” అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Prime Minister Narendra Modi) పిలుపునిచ్చారు. లోక్సభ ఎన్నికల ఫలితాల తరవాత (After the Lok Sabha election results) తొలిసారి మన్ కీ బాత్ (Mann Ki Baat) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నికల నేపథ్యంలో బ్రేక్పడిన ఈ కార్యక్రమం.. మూడో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ఈ ఆదివారం ప్రారంభించారు. మరోసారి ప్రగాఢ విశ్వాసంతో అధికారం అప్పగించిన దేశ ప్రజలకు థ్యాంక్స్ చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా లేని స్థాయిలో భారత్(Bharath) లో అతి భారీ ఎన్నికల ప్రక్రియ జరిగిందని, అందుకు అందరూ సహకరించారని వెల్లడించారు.
65 కోట్ల మందికి పైగా ఓటు హక్కు వినియోగించుకోడం చాలా గొప్ప విషయం అని ప్రశంసించారు. అరకు కాఫీ గురించి కూడా ప్రస్తావించారు మోదీ. అరకు కాఫీ అద్భుతం అని కొనియాడారు. అమృత్ మహోత్సవ్(Amrit Mahotsav) సందర్భంగా దేశవ్యాప్తంగా 60 వేల అమృత్ సరోవర్స్ ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. త్వరలో ఒలింపిక్స్ క్రీడాకారులను స్వయంగా కలుస్తానని తెలిపారు. అంతర్జాతీయ యోగ దినోత్సవం (International Yoga Day) సందర్భంగా వేడుకల్లో పాల్గొన్న అందరినీ అభినందించారు. వర్షాకాలం గురించి మాట్లాడుతూ కేరళ (Kerala) లో తయారయ్యే గొడుగుల గురించి ప్రస్తావించారు. కేరళలోని అట్టప్పడిలో ఈ గొడుగులను గిరిజన మహిళలే తయారు చేస్తారు. దేశవ్యాప్తంగా వీటికి డిమాండ్ పెరుగుతోందని గుర్తు చేశారు.
—————————–