బీజేపీ ఎంపీ బండి సంజయ్
* ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పాలన
* బీజేపీ ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వట్లే
* కాంగ్రెస్ ఎంపీలకు మేం నిధులు ఇవ్వకపోతే ఏం చేస్తారు..
* తెలంగాణ సర్కారుపై బీజేపీ ఎంపీ బండి సంచలన కామెంట్లు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కేసీఆర్(KCR)పై చేసినట్లే త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) పై కూడా తిరుగుబాటు తప్పదని బీజేపీ ఎంపీ బండి సంజయ్ (BJP MP Bandi Sanjay) హెచ్చరించారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పాలన సాగుతోందని విమర్శించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణ ప్రభుత్వంపై సంచలన కామెంట్లు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే నియోజకవర్గాల (BJP MLA constituencies) కు దురుద్దేశంతో ప్రభుత్వం నిధులు (Funds) ఇవ్వడం లేదని ఆరోపించారు. మేం కూడా కాంగ్రెస్ ఎంపీల (Congress MPs) కు నిధులు ఇవ్వకపో్తే ఏం చేస్తారని ప్రశ్నించారు. అందరికీ సమానంగా నిధులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) డిమాండ్ చేశారు. సింగరేణి విషయంలో బీఆర్స్(BRS) దారిలోనే కాంగ్రెస్(Congress) నడుస్తోందని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో తెలంగాణలో బీజేపీ(BJP), జనసేన(Janasena) పొత్తుపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రతిపాదనపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. జనసేనతో బీజేపీ పొత్తుపై కిషన్ రెడ్డి, జేపీ నడ్డా ఆలోచిస్తారని చెప్పారు. బీజేపీతో జనసేన పొత్తు తన పరిధిలో లేదని.. దానిపై తానేమీ మాట్లాడనని బండి సంజయ్ స్పష్టం చేశారు.
————————-
Please tell us what is wrong. Your report will be sent to the website team.
