
తీన్మార్ మల్లన్న
* కేసీఆర్ కుటుంబం నాపై హత్యాయత్నానికి తెగబడింది
* నా రక్తాన్ని కళ్లజూశారు
* దాడులతో బీసీ ఉద్యమాన్ని ఆపలేరు
* మీడియాతో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
ఆకేరున్యూస్ హైదరాబాద్ ః కేసీఆర్ కుటుంబం తనపై హత్యాయత్నానికి తెగబడిందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. జాగృతి కార్యకర్తలు క్యూ న్యూస్ పై దాడిచేసి కార్యాలయ సిబ్బందిపై భౌతిక దాడిచేసి కార్యాలయ ఫర్నిచర్ ను కంప్యూటర్లను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. జాగృతి కార్యకర్తల దాడిపై తీన్మార్ మల్లన్న మీడియాతో స్పందించారు. ఎమ్మెల్సీ కవిత కేసీఆర్, కేటీఆర్ మీద ఉన్న ఫస్ట్రేషన్ తో ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జాగృతి కార్యకర్తలు రౌడీల్లా వ్యవహరించి తన రక్తం కళ్ల జూశారని ఆ రక్తం మరకలతోనే ప్రజల్లోకి వెళ్తానని మల్లన్న అన్నారు. భౌతిక దాడులతో బీసీల ఉద్యమాన్ని ఆపలేరని మల్లన్న అన్నారు. మరింత ఉత్సాహంగా బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లామని అన్నారు. రానున్న రెండేళ్లలో కేసీఆర్ కుటుంబాన్ని రాజకీయంగా భూ స్థాపితం చేస్తానని మల్లన హెచ్చరించారు.
…………………………………………