
* తల్లిదండ్రులకు ఓ మహిళా డాక్టర్ మెసేజ్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తనతో గొడవ పడనని హామీ ఇస్తేనే ఇంటికి తిరిగి వస్తానని ఇంటి నుంచి వెళ్లిపోయిన ఓ మహిళా డాక్టర్ తల్లిదండ్రులకు మెసేజ్ చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని దమ్మాయిగూడకు చెందిన డాక్టర్ శిరీష అమీర్‌పేటలోని వెల్నెస్ సెంటర్లో విధులు నిర్వర్తిస్తోంది. శిరీష తన ఫ్రెండ్ ఆంథోనీకి బ్యాంకు లోన్ విషయంలో సహాయం చేసినప్పటి నుంచి ఆమె తల్లిదండ్రులు గొడవ పడుతున్నారు. ఈ క్రమంలో జులై 29న విధులకు వెళ్తున్నానని ఇంటినుంచి వెళ్లి ఇప్పటి వరకు తిరిగి రాలేదు. అమీర్‌పేటలో నివాసం ఉంటున్న ఆమె డాక్టర్ శిరీష తల్లిదండ్రులు ఎస్సార్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మీరు ఎప్పుడైతే తనతో గొడవ పడకుండా ఉంటారో… అప్పుడే తాను ఇంటికి వస్తానని తల్లిదండ్రులకు డాక్టర్ శిరీష మేసేజ్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
……………………………………….