* గాంధీ-కౌశిక్ వివాదం బీఆర్ఎస్ పంచాయితీ
* దాన్ని సర్కారుకు అంటగట్టకండి
* పదేళ్లు అధికారం అనుభవించి ఇప్పుడు ప్రాంతీయవాదం అంటున్నారు
* దీనికి కేసీఆర్ సమాధానం చెప్పాలి
* సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సీఎం రేవంత్(CM REVANTH) ను విమర్శిస్తే నాలుక కోస్తామని, అది కేటీఆర్(KTR) అయినా, వాళ్ల పార్టీ వాళ్లు అయినా సరే అని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి(JAGGAREDDY) హెచ్చరించారు. గాంధీభవన్(GANDHIBHAVAN)లో ఆయన మీడియాతో మాట్లాడారు. గాంధీ-కౌశిక్(GANDHI-KOUSIK) వివాదం బీఆర్ ఎస్(BRS) పంచాయితీ అని, ప్రభుత్వానికి సంబంధం లేదని తెలిపారు. పదేళ్లు అధికారం అనుభవించి ఇప్పుడు ప్రాంతీయవాదం అంటున్నారని, దీనికి కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కండువాలు కప్పే సంస్కృతి తెచ్చింది కేసీఆరే అన్నారు. అమెరికాలో ఉండి కేటీఆర్(KTR), ఫామ్ హౌస్‌లో కేసీఆర్(KCR), రోడ్లపై హరీశ్‌రావు(HARISHRAO) దాడులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. నిమజ్జన ఉత్సవాలను కరాబు చేయడానికి చూస్తున్నారని ఆరోపించారు. టీవీల్లో ఆ ఉత్సవాలే లేకుండా చేశారని, ఇప్పుడు మీముఖాలే చూడాలా అని చమత్కరించారు. పవర్ పోయే సరికి నిద్ర పట్టడం లేదా, ప్రజలు షాక్ ఇచ్చేసరికి వారి మతిభ్రమించిందని అన్నారు. 2014 టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గులాబీ కండువా కప్పి లాక్కున్నారని, తెలంగాణ రాజకీయాల్లో విలువలు లేకుండా కేసీఆర్ చేశారని విమర్శించారు.
—————————–