* మీకు అండగా ఉంది బీఆర్ఎస్ ఉంది
* ఆర్బీ ఎక్స్ చెరిపేసి.. కేసీఆర్ పేరు రాయండి
* ఎవడు టచ్ చేస్తాడో మేం చూస్తాం
* ఓట్లు వేయలేదని హైదరాబాద్వాసులపై రేవంత్ కు పగ
* మూసీ బాధితులతో మాజీ మంత్రి కేటీఆర్
* సీఎం రేవంత్ మగాడైతే గ్యారెంటీలను అమలు చేయాలని సవాల్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఇళ్లను కూల్చేందుకు ఎవరైనా వస్తే చీపుర్లు, రోళ్లతో కొట్టాలని, బుల్డోజర్లను అందరూ కలిసికట్టుగా అడ్డుకోవాలని మూసీ నిర్వాసితులకు మాజీ మంత్రి కేటీఆర్ (KTR) సూచించారు. మూసీ ప్రక్షాళన పేరుతో హైదరాబాద్లో రేవంత్ రెడ్డి లక్షలాది మందికి నిద్రలేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబర్పేట నియోజకవర్గంలోని గోల్నాక పరిధి తులసీరామ్ నగర్లో మూసీ ప్రాంత వాసులను మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, మహమూద్ అలీ, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, సుధీర్ రెడ్డితో కలిసి కేటీఆర్ పరామర్శించారు. ఓట్లు వేయలేదని హైదరాబాద్(HYDERABAD)వాసులపై రేవంత్ పగబట్టారని విమర్శించారు. మగాడైతే గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. బడ్జెట్లో సగం డబ్బులతో మూసీ(MUSI) ప్రక్షాళన చేపట్టారని ఆరోపించారు. మూసీ పరివాహక ప్రాంత వాసులను అడవిలోకి పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇండ్లు కడతామంటూ కూల్చుతున్నారని చెప్పారు. ఆర్బీ ఎక్స్ చెరిపేసి.. కేసీఆర్ పేరు రాయాలని, ఎవడు టచ్ చేస్తాడో చూస్తామని బాధితులకు భరోసా ఇచ్చారు. పేదల ఇళ్లు కూల్చుతుంటే ఈ ప్రాంత ఎంపీ ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. ఇళ్లను కూలుస్తుంటే.. మీరు ఎన్నుకున్న కిషన్రెడ్డి(KISHANREDDY) ఎక్కడా అని ప్రశ్నించారు.
……………………………..