
* డివిజనల్ ఇంజనీర్ టెక్నికల్ టి. వెంకటేశ్వర్లు.
ఆకేరు న్యూస్ , ములుగు: రైతులు, వినియోగదారులు విద్యుత్ సమస్యలు ఏర్పడితే 1912 కు సమాచారం అందించి సమస్య పరిష్కరించుకోవాలని భూపాలపల్లి సర్కిల్ సిప్టీ ఆఫీసర్, డివిజనల్ ఇంజనీర్ టెక్నికల్ టి. వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల విద్యుత్ సమస్యల పరిష్కారానికి విద్యుత్ అధికారుల పొలంబాట కార్యక్రమాన్ని చేపడుతున్నామని, ఇందులో వంగిన పోల్ లను, లూజ్ లైన్ లను సరిచేస్తున్నామని, మద్య స్తంభాలను ఏర్పాటు చేస్తున్నామని, తీగల మధ్య అవసరం ఉన్న చోట స్పిసర్స్ పెడుతున్నామని తెలిపారు. ఇప్పటివరకు పొలంబాట కార్యక్రమం ద్వారా 351 వంగిన పోల్లు, లూజ్ లైన్లు -134. తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్ఫార్మర్ల గద్దెలు-36, మార్చినామని తెలిపినారు. రైతులకు మరింత మెరుగైన, నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా అందిస్తున్నామనీ, వివరించారు రైతులకు విద్యుత్ ప్రమాాల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలు తదితర అంశాలపై అవగాహన కల్పిస్తూనమని వివరించారు. ఒకవేళ ట్రాన్స్ఫార్మర్లు ఫెయిల్ అయితే వ్యవసాయదారులు వెంటనే 1912 ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని అధికారులు వెంటనే ఇస్పందించి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకొని యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు జరిగేటట్లు చేస్తారని అన్నారు.
………………………………………….