గొత్తి కోయ మహిళ ఆరోగ్యం గురించి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
* గొత్తి కోయలకు ఆరోగ్యంపై ప్రత్యేక అవగాహన కల్పించాలి.
ఆకేరు న్యూస్, ములుగు : ఎలా ఉందమ్మా ఆరోగ్యం.. నీ ఆరోగ్యం .. నీ కవల పిల్లల ఆరోగ్యం ఎలా ఉంది. డాక్టర్లు బాగా చూసుకుంటున్నారా..? అని గొత్తి కోయ మహిళను ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ( Ila Tripathi ) అడిగి తెలుసుకున్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ స్థానిక ( Mulugu ) సామాజిక ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వెంకటాపూర్ మండలం తొర్రి చింతల పాడు గొత్తి కోయ గ్రామానికి చెందిన మహిళ కవలలకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా ఆమెను పరామర్శించారు. ఆమె ఆరోగ్యం గురించ అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గొత్తి కోయ గిరిజన గ్రామాలలో మహిళలకు రెవిన్యూ , పోలీస్, వైద్యాధికారుల సమన్వయంతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు కల్పించాలని సూచించారు. మహిళలు ప్రెగ్నెన్సీ విషయంలో జాగ్రత్త పాటించాలని సొంత వైద్యంతో ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో చికిత్స చేయించుకోవాలని తెలిపారు. ముఖ్యంగా గొత్తి కోయ గ్రామాలపై ఆశ వర్కర్స్, ఏఎన్ఎంలు అప్రమత్తంగా ఉండాలని గర్భిణీల విషయంలో పూర్తి వివరాలు స్థానిక ప్టాథమిక ఆరోగ్య కేంద్రాలలో నమోదు చేయాలన్నారు . ప్రసూతి సమయానికి ముందే వారితో మాట్లాడి ఆరోగ్య కేంద్రాలకు తరలించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌తో పాటు ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ చిత్ర మిశ్రా, అదనపు కలెక్టర్ పి .శ్రీజ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ అప్పయ్య, సామాజిక ఆరోగ్య కేంద్ర వైద్య అధికారి డాక్టర్ జగదీష్ తదితరులు పాల్గొన్నారు .
—————————