
* వాహనాన్ని పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు
* టమాటా బాక్సుల చాటున పశువులు
ఆకేరు న్యూస్ ములుగుః ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తుండగా టమాట బాక్సుల చాటున పశువులు కనపడకుండా చేసి కంటేయినర్ వాహనం లో అక్రమంగా తరలిస్తున్న పశువులను చాకచక్యంగా ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. అనంతరం మండల కేంద్రం లోని పోలీస్ అధికారులకు సమాచారం అందించారు . అక్రమంగా ఆవులను తరలిస్తున్న వాహనంపై విచారణ చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామంటూ పోలీసులు వివరించారు.
………………………………………….