Impure Movie
* నందిని రెడ్డి
ఆకేరు న్యూస్, సినిమా: వారాహి మల్లిపాముల, శ్రీదేవి మల్లిపాముల నిర్మించిన ఇంప్యూర్ చిత్రానికి నిశాంతి ఇవని దర్శకత్వం వహించారు. సాయి కృష్ణ, యష్న, అభిజిత్ ప్రధాన పాత్రల్లో నటించారు. తాజాగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ట్రైలర్, పాటను విడుదల చేశారు. దర్శకురాలు నందిని రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
* నిశాంతితో 15 ఏళ్ల స్నేహం
ఈ సందర్భంగా నందిని రెడ్డి మాట్లాడుతూ.. నిశాంతి తనకు 15 ఏళ్లుగా తెలుసని, మంచి స్నేహితురాలని తెలిపారు. ప్రతి తెలుగు వ్యక్తికి సినిమా చేయాలనే కల ఉంటుందని చెప్పారు. పేరెంట్స్ ప్రోత్సహిస్తేనే మనం ఏదైనా సాధించగలమని అన్నారు. ఇంప్యూర్ మంచి విజయం సాధించి చిత్రబృందానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
* పెళ్లి రద్దుతో కథ
దర్శకురాలు నిశాంతి మాట్లాడుతూ.. ఒక పెళ్లి రద్దు కావడంతో ముగ్గురి జీవితాల్లో చోటుచేసుకునే మార్పులే సినిమా కథాంశమని తెలిపారు. సంధ్య, ప్రణవ్, ధీర పాత్రల చుట్టూ కథ సాగుతుందని చెప్పారు.
* మంచి సినిమా వచ్చింది
హీరో సాయి కృష్ణ మాట్లాడుతూ.. తనను నమ్మి లీడ్ రోల్ ఇచ్చిన నిశాంతికి ధన్యవాదాలు తెలిపారు. నిర్మాత శ్రీదేవి మంచి క్వాలిటీ కోసం రాజీపడలేదన్నారు. సినిమా బాగా వచ్చిందని, ప్రేక్షకులు థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాలని కోరారు.
* పృథ్వీ శుభాకాంక్షలు
30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ మాట్లాడుతూ.. నిశాంతి ప్రతిభను ఆమె తల్లి ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. ఇంప్యూర్ మంచి విజయం సాధించాలని కోరారు. నందిని రెడ్డి హార్డ్‌వర్కర్ అని ప్రశంసించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
