Impure Movie
* 92 కెమెరాలతో ప్రత్యేక క్యాప్చర్
* సెప్టెంబర్ 15న అధికారిక గుర్తింపు
Raaka| ఆకేరు న్యూస్, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్లో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ చిత్రం రాకా అరుదైన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. ఒకేసారి 37 మంది వ్యక్తుల హావభావాలు, మోషన్‌ను రియల్ టైమ్‌లో క్యాప్చర్ చేసినందుకు ఈ గుర్తింపు దక్కింది.
* 92 కెమెరాలతో రికార్డ్
2026 ఫిబ్రవరిలో నిర్వహించిన ప్రత్యేక మోషన్ క్యాప్చర్ ప్రక్రియలో 4 ఏళ్ల చిన్నారి నుంచి 70 ఏళ్ల వ్యక్తి వరకు మొత్తం 37 మంది కళాకారుల పెర్ఫార్మెన్స్ను ఒకే సెషన్లో క్యాప్చర్ చేశారు. ఇందుకోసం 92 ఆప్టికల్ మోషన్ క్యాప్చర్ కెమెరాలను వినియోగించినట్లు చిత్రబృందం తెలిపింది.
* సెప్టెంబర్ 15న అధికారిక గుర్తింపు
ఈ ఘనతకు సెప్టెంబర్ 15, 2026న గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారిక గుర్తింపు లభించింది. గిన్నిస్ సీనియర్ అడ్జుడికేటర్ స్వప్నిల్ డాంగ్రికర్ అల్లు అర్జున్, దర్శకుడు వి. అరుణ్‌కుమార్‌కు సర్టిఫికెట్ అందజేశారు. అత్యాధునిక మోషన్ క్యాప్చర్, ఫేషియల్ క్యాప్చర్, రియల్‌టైమ్ అన్రియల్ విజువలైజేషన్ వంటి సాంకేతికతలను ఈ ప్రక్రియలో ఉపయోగించినట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ రికార్డుతో భారతీయ సినిమా సాంకేతిక సామర్థ్యానికి ప్రపంచస్థాయిలో మరో గుర్తింపు లభించిందని చిత్రబృందం పేర్కొంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
