* నటి హేమతో పాటు 86 మందికి నోటీసులు
ఆకేరు న్యూస్, బెంగళూరు : రేవ్ పార్టీ కేసు దర్యాప్తులో బెంగళూరు పోలీసులు ఒక్కో అడుగు ముందుకేస్తున్నారు. పార్టీకి హాజరైన వారి బ్లడ్ శాంపుల్స్ సేకరించి.., ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారో నిర్దారణకు వచ్చిన పోలీసులు.. ఇప్పుడు వారందరికీ నోటీసులు జారీ చేశారు. విచారణకు రావాలని తెలుగు సినీ నటి హేమతో పాటు 86 మందికి నోటీసులు పంపారు. ఈనెల 27న విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. బెంగళూరు క్రైం బ్రాంచ్ పోలీసుల ఎదుట సోమవారం హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
హాట్ టాపిక్ గా హేమ..
రేవ్ పార్టీ టోటల్ ఎపిసోడ్ లో తెలుగు నటి హేమ హాట్ టాపిక్ గా మారారు. నేను పాల్గొనలేదని మొదట్లో బుకాయించారు. ఫేక్ వీడియో రూపొందించి అందరినీ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. బెంగళూరు పోలీసులు ఫొటో రిలీజ్ చేయడంతో హేమ బండారం బట్టబయలైంది. అంతేకాకుండా, ఆమె కృష్ణవేణి పేరుతో పార్టీకి హాజరుకావడంతో మరో సంచలనంగా మారింది. ప్రస్తుతం ఆమె నుంచి సేకరించిన బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లు తేలినట్లు బెంగళూరు పోలీసులు చెప్పడం, ఈనెల 27న విచారణకు రావాలని ఆమెకు నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అయితే, మొదటి నుంచి నేను రేవ్ పార్టీలో పాల్గొనలేదని బుకాయిస్తూ వస్తున్న నటి హేమ ఈనెల 27న బెంగళూరు క్రైం బ్రాంచ్ ఎదుట విచారణకు హాజరవుతారా? లేదా అనే విషయం ఉత్కంఠగా మారింది.
————————-