ఆకేరు న్యూస్, సిద్దిపేట : బతికున్న అమ్మానాన్నలనే కొందరు పిల్లలు పట్టించుకోవడం లేదు. మరికొందరు డబ్బున్నబాబులు వారికి సేవలు చేయలేక.. వృద్దాశ్రమాల్లో చేర్పించేస్తున్నారు. కనిపెంచిన అమ్మానాన్నలను భారంగా భావిస్తున్నారు. అలాంటి వారున్న నేటి కాలంలో చనిపోయినా.. అమ్మానాన్నలు కళ్లముందే ఉండాలని వాళ్లకు తమ పొలంలో గుడి కట్టారు కుమారులు. అంతేకాదు.. వారిని నిత్యం పూజిస్తూ తల్లిదండ్రులకు మించిన దైవం లేరని నిరూపిస్తున్నారు. తెలంగాణలోని సిద్దిపేట జిల్లా అక్కన్నపేటకు చెందిన గొట్టె కనకయ్య, కొమురవ్వ దంపతులకు సదయ్య, మహేందర్, చిరంజీవి అనే ముగ్గురు కొడుకులు ఉన్నారు. నాలుగేళ్ల కిత్రం తల్లి కొమురవ్వ మృతి చెందారు. గతేడాది తండ్రి చనిపోయాడు. మనుషులు లేకపోయినా వారి రూపాలు కళ్ల ముందే ఉండేలా పొలంలో తల్లిదండ్రులకు గుడి కట్టారు. నిత్యం వారిని పూజిస్తున్నారు.
————————