* వరుస కాల్పులతో హడలెత్తిస్తున్న వైనం
* దొంగల ఆటకట్టించడమే ధ్యేయంగా రంగంలోకి డెకాయి బృందాలు
* హైదరాబాద్‌లో మరోసారి కాల్పులు
* ఆత్మరక్షణ కోసమే అంటున్న పోలీసులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : దొంగలపై పోలీసులు కన్నెర్ర చేస్తున్నారు. ఎక్కడికక్కడ వారి ఆటకట్టిస్తున్నారు. తరచూ దొంగతనాలు, దోపిడీలు జరిగే ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించేందుకు ప్రత్యేకంగా డెకాయ్ టీమ్ (Decoy Team)లు రంగంలోకి దిగాయి. చైన్‌స్నాచింగ్ (Chain snatching) హాట్‌స్పాట్ (Hotspot) లుగా పిలిచే ప్రదేశాల్లో చేజ్ అండ్ క్యాచ్ టీమ్ (Chase and catch team) (సీసీటీ) సభ్యులు మోహరిస్తున్నారు. రాత్రి, పగలు లేకుండా పహారా కాస్తున్నాయి. అవసరమైతే కాల్పులకూ వెనకాడడం లేదు. దొంగలపై పోలీసులు కాల్పులు జరుపుతున్న ఘటనలు ఇటీవలి కాలంలో పెరుగుతున్నాయి. తాజాగా శుక్రవారం అర్దరాత్రి నాంపల్లి రైల్వేస్టేషన్ (Nampally Railway Station) వద్ద కాల్పులు కలకలం సృష్టించాయి.
గొడ్డలితో దాడి చేయడంతో..
గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత నాంపల్లి రైల్వే స్టేషన్ (Nampally Railway Station) సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు గుర్తించారు. వారిని అడ్డుకుని ప్రశ్నించారు. అయితే వారు సమాధానం చెప్పకపోవడంతో పట్టుకోవడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులపై ఓ వ్యక్తి గొడ్డలితో దాడికి యత్నించారు. మరొవ్యక్తి రాళ్లతో దాడి చేశాడు. ఈ క్రమంలో పోలీసులు కాల్పులు జరిపి దుండగులను పట్టుకున్నారు. కాల్పుల్లో రాజు అనే వ్యక్తితోపాటు మరొకరికి గాయాలయ్యాయి. మరో ఇద్దరు దుండగులు తప్పించుకున్నారు. వారికోసం పోలీసులు (Police) గాలిస్తున్నారు. గాయపడినవారిని ఉస్మానియా దవాఖాన (Osmania Hospital) కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, కాల్పుల ఘటనపై ఉన్నతాధికారులు స్పందించారు. సెంట్రల్ జోన్ డెకాయిట్ బృందాలు కాల్పులు జరిపాయని, అయితే ఆత్మరక్షణ కోసమే ఇది జరిగినట్లు వివరణ ఇచ్చారు. నిందితులు గొడ్డలితో పోలీసులపై దాడి జరపడంతో కాల్పులు జరపాల్సి వచ్చిందన్నారు.
వరస కాల్పులు
గతంలో వనస్థలిపురం(Vanasthalipuram) లో చైన్ స్నాచర్లపై పోలీసులు కాల్పులు (Police firing)జరిపారు. ఇటీవలే హైదరాబాద్ (Hyderabad) శివార్లలోని అబ్దుల్లాపూర్‌మెట్ (Abdullahpurmet) లో పార్ధీ గ్యాంగ్ దొంగలను పట్టుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఇక గత నెలలో సికింద్రాబాద్ (Secunderabad) లోని సిటీలైట్ హోటల్ (Citylight Hotel) వద్ద యాంటీ స్నాచింగ్ టీమ్ పోలీసులు (Anti Snatching Team Police).. పారిపోతున్న దొంగల బైక్ టైరును కాల్చాలని ప్రయత్నించగా.. ఆ తూటా బైక్ వెనుక కూర్చున్న వ్యక్తి కాలులోకి దూసుకెళ్లింది. అనంతరం ఇద్దరు స్నాచర్లను పట్టుకున్నారు. మరో ఘటనలో గత కొన్నిరోజులుగా వరుస దొంగతనాలకు పాల్పడుతున్న చైన్ స్నాచర్లపై సైదాబాద్ పోలీసులు కాల్పులు (Saidabad police fired) జరిపారు. వారిని అమీర్ గ్యాంగ్ (Ameer Gang) కు చెందిన దొంగలుగా గుర్తించారు.
——————————