ఆకేరున్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలోని హోంగార్డుల డీఏ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డీఏను రూ.921 నుంచి రూ.వెయ్యికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. వీక్లీ పరేడ్ అలవెన్స్‌ను రూ.100 నుంచి రూ.200కు పెంచింది. అలాగే విధుల్లో చనిపోయిన హోంగార్డుల కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి నుంచి ఇది అమలులోకి వస్తుందని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
………………………………..