* ఐదుగురు యువకులు మృతి
* అందరూ 22 నుంచి 25 సంవత్సరాల వారే..
ఆకేరున్యూస్, భువనగిరి: భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున పోచంపల్లి మండలంలోని జలాల్పూర్ చెరువులోకి కారు దూసుకెళ్లడంతో ఐదుగురు యువకులు జలసమాధి అవగా.. ఒకరు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. మృతులను వంశీగౌడ్, దినేశ్, హర్ష, బాలు, వినయ్గౌడ్గా గుర్తించారు. వారంతా 22 నుంచి 25 ఏండ్ల మధ్య వయసు వాళ్లేనని తెలిపారు. ప్రమాద సమయంలో కారులో ఆరుగురు ఉన్నారని తెలిపారు. మణికంఠ అనే యువకుడు క్షేమంగా భయట పడ్డాడని పేర్కొన్నారు.
………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
