ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు (Inter Supply Results)ఈ రోజు వచ్చేశాయి. తాజా ఫలితాల్లో ఫస్ట్ ఇయర్ లో 67.4 శాతం, సెకండ్ ఇయర్ లో 50.82 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ బోర్డు అధికారులు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరైన విద్యార్ధులతోపాటు మార్కులను పెంచుకోవడానికి ఇంప్రూవ్మెంట్ పరీక్షలు రాసిన వారికి కూడా ఫలితాలను వెల్లడించారు. అధికారిక వెబ్సైట్ tgbie.cgg.gov.in లేదా results.cgg.gov.inలలో విద్యార్థలు తమ హాల్ టికెట్ నంబర్‌ను ఎంటర్ చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. సబ్జెక్ట్ వైజ్ విద్యార్థుల మార్కుల వివరాలు బోర్డు అధికారులు అందుబాటులో ఉంచినట్లు బోర్డు అధికారులు వెల్లడించారు.
……………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
