
* హైదరాబాద్‌లో రెచ్చిపోయిన యువతీయువకులు
* సోషల్‌మీడియాలో వైరల్ గా వీడియో
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కొందరి ప్రేమ పరిమితులను దాటుతోంది. పైశాచికంగా మారుతోంది. యువతీయువకులు పాడు పనికి పాల్పడుతున్నారు. ఎవరైనా చూస్తారన్న జిజ్ఞాస కానీ.. ప్రమాదం జరుగుతుందని భయం కానీ లేకుండా బైకులపై వికృత పనులను చేపడుతున్నారు. తాజాగా హైదరాబాద్ (HYDERABAD)లో ఓ జంట చేసిన పనిని చూసి అందరూ హవ్వా అని నోరువెళ్లబెడుతున్నారు. సోషల్‌మీడియాలో ఆ వీడియో వైరల్‌గా మారుతోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. అమ్మాయి, అబ్బాయి బైకుపై వెళ్తున్నారు.. అందులో తప్పేముంది అనుకుంటున్నారా.., వెనుక కూర్చోవాల్సిన అమ్మాయి బైకుపై ముందు అబ్బాయిని ఎదురంగా వాటేసుకుని ఉంది. హైదరాబాద్‌లోని ఆరాంఘర్ ఫ్లైఓవర్‌పై ఆ జంట బహిరంగంగానే బైకుపై వెళ్తూ హద్దులు దాటింది. అమ్మాయి ఎదురంగా గట్టిగా వాటేసుకుని కూర్చుంటే అబ్బాయి జోరుగా వాహనం నడుపుతున్నాడు. రోడ్డుపై ఆ జంటను చూసిన వాహనదారులు అవాక్కయ్యారు. ఎక్కడ ప్రమాదానికి గురవుతారోనని భయ పడ్డారు. ఇప్పుడా వీడియో సోషల్‌మీడియా(SOCIAL MEDIA)లో వైరల్ గా మారుతుండడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. నడిరోడ్డుపై ఇలా హద్దులు దాటడం మంచిది కాదని హితవు పలుకుతున్నారు.
……………………………………….