* మహిళను చితకబాదిన కేసులో చర్యలు
* డీఐ సహా ఐదుగురు కానిస్టేబుళ్లు సస్పెన్షన్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బంగారం దొంగతనం చేసిందని ఓ మహిళను చితకబాదిన కేసులో పోలీసుశాఖ (Police Department) సీరియస్ అయింది. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకుంది. షాద్‌నగర్ పీఎస్ డీఐ రాంరెడ్డి (Shadnagar PS DI Ram Reddy) ని సస్పెండ్ చేస్తూ సీపీ అవినాష్ మహంతి (CP Avinash Mahanty) ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనతో పాటు మరో ఐదుగురు కానిస్టేబుళ్లు (Five constables)కూడా సస్పెండ్ (Suspend) అయ్యారు. వారిలో ఓ మహిళా కానిస్టేబుల్ కూడా ఉన్నారు. అసలు ఏం జరిగిందంటే.. సైబరాబాద్ పరిధిలోని షాద్ నగర్ పట్టణంలోని అంబేద్కర్ కాలనీలో 2 వారాల కిందట ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. 24 తులాల బంగారం, 2 లక్షల నగదు పోయిందంటూ నాగేందర్ (Nagender) అనే వ్యక్తి గత నెల 24వ తేదీన షాద్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పక్కింట్లో ఉంటున్న వారిపై అనుమానం ఉందంటూ ఫిర్యాదు చేశాడు.. నాగేందర్ ఇచ్చిన ఫిర్యాదుతో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డి (Detective Inspector Ram Reddy) విచారణ ప్రారంభించారు. మొదట రామ్ రెడ్డి మరో నలుగురు సిబ్బందితో సునీత (Sunita), భీమయ్య (Bhimaiah) దంపతులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ తర్వాత భర్త భీమయ్యను వదిలేసిన పోలీసులు.. తొమ్మిదవ తరగతి చదువుతున్న కుమారుడు 13 ఏళ్ల జగదీష్ ను అదుపులోకి తీసుకున్నారు.. తల్లి, కొడుకులను ఇద్దరినీ ఒక దగ్గరే ఉంచి వివరాలు సేకరించారు.. నిజం చెప్పడం లేదంటూ తల్లి కొడుకులను కొడుతూ తమదైన శైలిలో ఇంటరాగేషన్ (Interrogation) చేశారు. డిఐ రాంరెడ్డి తన కొడుకు ముందే కొడుతూ.. చిత్రహింసలకు గురి చేసినట్టు బాధితురాలు సునీత పేర్కొన్నారు. కాళ్ల మధ్యన కర్రలు పెట్టి బూటు కాళ్లతో తొక్కుతూ.. తన కన్నకొడుకు జగదీశ్వర్ ముందే చితకబాదారంటూ పేర్కొంది.. దొంగతనం నేరం ఒప్పుకోకపోవడంతో జగదీశ్వర్‌ను కూడా అరికాళ్ళపై లబ్బర్ బెల్ట్‌తో కొట్టారని బాధితురాలు పేర్కొంది.. కొడుతున్న దెబ్బలకు తాళలేక మూర్చపోయి స్పృహ తప్పిపోగా తనను ఇంటికి పంపించారని ఆవేదన వ్యక్తంచేసింది.. అది కూడా తనపై ఫిర్యాదు చేసిన వ్యక్తి కారులోనే ఇంటికి పంపించారని పేర్కొంది. 10 రోజుల కిందట జరిగిన ఈ ఘటన ఇప్పుడు వెలుగులోకి రావడంతో తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) వెంటనే యాక్షన్‌లోకి దిగింది. చోరీ కేసులో మహిళను చితక్కొట్టిన పోలీసులపై సీరియస్ అయిన సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy).. షాద్‌నగర్ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు.. షాద్‌నగర్ ఏసీపీ రంగస్వామి (Shadnagar ACP Rangaswamy) తో సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. సీఎం ఆదేశాలతో ఇన్స్పెక్టర్ రామ్‌రెడ్డిని వెంటనే హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేశారు. తాజాగా ఆయనతో పాటు ఐదుగురు కానిస్టేబుళ్లను పోలీసులు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
———————–