
* రైతులకు మంత్రి సీతక్క హామీ
ఆకేరు న్యూస్, ములుగు: లక్నవరం చెరువు కింద ప్రతీ ఎకరానికి మీరు అందిస్తామని, రామప్ప చెరువు కెనాల్ నుండి లక్నవరం చెరువు లో కి సమృద్ధిగా నీటిని నింపుతామని రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి ధనుసరి అనసూయ సీతక్క తెలిపారు . శుక్రవారం లక్నవరం సరస్సు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత కొంతకాలంగా రైతులకు నాట్లు వేసుకోవడానికి నీటి కొరత ఉందని తెలుసుకొని, ఇటీవల లక్నవరం సరస్సు తూముల మరమ్మతు పనుల పూర్తచేశామని తెలిపారు. ప్రస్తుతం లక్నవరం సరస్సు 28 ఫీట్ల నీటి మట్టం కలిగి ఉందని, మొత్తం 33 ఫీట్లు సామర్థ్యాన్ని సరస్సు కలిగి ఉందని అన్నారు. అయితే ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగ పరుచుకొని సకాలంలో వరి నాట్లు వేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టిస్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి తో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు రైతుకు తదితరులు పాల్గొన్నారు.
…………………………………………………….