* 300కు పైగా మృతి
ఆకేరు న్యూస్, లెబనాన్ : లెబనాన్‌పై ఇజ్రాయెల్ భారీగా వైమానిక దాడులు జరిపింది. హిజ్బుల్లా గ్రూప్ స్థావరాలే లక్ష్యంగా వైమానిక దాడులకు విరుచుకుపడిరది. ఈ దాడుల్లో 300 లకు పైగా మంది ప్రాణాలు కోల్పోయారని లెబనాన్ ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది. అలాగే మరో 300 మంది వరకు గాయపడ్డారని తెలిపింది. అక్టోబర్ 7 తర్వాత గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం అనంతరం మరోసారి యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. దాడులకు ముందు ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్‌లో ఉన్న ప్రజలకు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని సూచించింది. బీరూట్‌తో సహా పలు ప్రాంతాల్లోని ప్రజలను ల్యాండ్‌లైన్ కాల్ సందేశాల ద్వారా హెచ్చరించినట్లు పేర్కొంది. డజన్ల కొద్దీ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్‌లో దాడికి దిగింది. హులా, మజ్దాల్ సేలం, తౌరా, హారిస్, క్లయిలే, నబీ చిట్, హర్బాటా సహా పలు ప్రాంతాల్లో ఐడీఎఫ్ వైమానిక దాడులు జరిపింది. మృతుల్లో పిల్లలు, మహిళలు, పారామెడికల్ సిబ్బంది ఉన్నారని ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఐడీఎఫ్ ప్రతినిధి డేనియల్ హగారి మాట్లాడుతూ బెకా వ్యాలీలో హిజ్బుల్లాకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడికి సిద్ధమవుతుందని.. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలంతా ఖాళీ చేసి వెళ్లిపోవాలని హెచ్చరించారు. ఇజ్రాయెల్ లెబనాన్‌లో వైమానిక దాడులు ప్రారంభించిందని.. ఇజ్రాయెల్ సైన్యం హిజ్బుల్లాకు వ్యతిరేకంగా భారీ ఎత్తున దాడి చేయబోతున్నందున లెబనాన్ ప్రజలు తమ భద్రత కోసం హెచ్చరికలు చేసినట్లు చెప్పారు. ఇజ్రాయెల్ సుమారు 300 కంటే ఎక్కువ హిజ్బుల్లా సైట్లను ధ్వంసం చేయగా.. ఇజ్రాయెల్, హిజ్బుల్లా గ్రూప్‌లను యుద్ధం అంచున నుంచి వెనక్కి వెళ్లేలా ప్రపంచ శక్తులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. లెబనాన్ దక్షిణ, తూర్పు భాగంలోని ప్రాంతాలతో పాటు రాజధాని బీరుట్ దక్షిణ శివారు ప్రాంతాలు హిజ్బుల్లాకు పెట్టని కోటలుగా పేర్కొంటారు. ఇజ్రాయెల్ నుంచి త్వరగా ఖాళీ చేయమని ఫోన్ సందేశాలు వచ్చాయని దాడులకు ముందు లెబనీస్కు అధికారిక నేషనల్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. లెబనాన్‌లోని ఒక శక్తివంతమైన రాజకీయ, సైనిక శక్తి అయిన హిజ్బుల్లా, ఇరాన్ కూడా మద్దతునిచ్చే పాలస్తీనా మిత్రపక్షం హమాస్‌కు మద్దతుగా లెబనాన్ సరిహద్దు వెంబడి ఇజ్రాయెల్ దళాలతో దాదాపు రోజువారీ యుద్ధంలో పాల్గొంటున్నట్లు వస్తున్నది.
………………………………