* హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తుండగా ఘటన
* ఒంటిమిట్టలో ల్యాండ్ చేసిన పైలట్
* విమానంలో 64 మంది ప్రయాణికులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్(Hyderabad) నుంచి తిరుపతి(tirupathi) వెళ్తున్న విమానంలో అకస్మాత్తుగా సాంకేతికలోపం తలెత్తింది. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. పైలట్ అప్రమత్తంగా వ్యవహరించి ఒంటిమిట్ట(Ontimitta)లో అత్యవసరంగా ల్యాండ్ చేయడంతో ఊపిరి పీల్చుకున్నారు. మంగళవారం ఉదయం హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం(Shamshabad Airport) నుంచి 64 మంది ప్రయాణికులతో బయలుదేరిన విమానం లో కొద్దిసేపటికే సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పైలెట్ ఉన్నతాధికారుల అనుమతి తీసుకుని ఒంటిమిట్టలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. దీంతో ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. వారికి ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేస్తున్నారు. విమానాన్ని శంషాబాద్‌కు తరలించారు.
…………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
