* గూస్ బంప్ రేపుతున్న ఎన్టీఆర్ డైలాగ్స్
ఆకేరు న్యూస్, సినిమా డెస్క్ : ‘అసలు ఎవరు వారంతా..?’ ‘కులం లేదు.. మతం లేదు.. భయం అసలే లేదు.. ధైర్యం తప్ప ఏమీ తెలియని కళ్లల్లో మొదటిసారి భయం పొరలు కమ్ముకున్నాయి.’ ఎవరు చేశారు ఇదంతా.. ఇదంతా.. సానా పెద్ద కథ సామీ. రక్తంతో సముద్రమే ఎరుపెకెక్కిన కథ. మా దేవర కథ. మనిషికి బతికేంత ధైర్యం చాలు.. చంపేంత కాదు.. కాదు కూడదు మీరు ఆ ధైర్యాన్ని కూలగొడితే.. ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అవుతా. దేవరను చంపాలంటే సరైన సమయమే కాదు.. సరైన ఆయుధం కూడా దొరకాలా.. పనిమీద పోయినోడు అయితే పని అవగానే తిరిగొస్తాడు. పంతం పట్టి పోయినాడు నీ కొడుకు. సినిమా రిలీజ్ కు ముందే ఎన్టీఆర్ దేవర డైలాగులు( (Ntr Devara Dialogues) ఫ్యాన్స్ గూస్ బంప్ తెప్పిస్తున్నాయి. రిలీజ్ చేసిన ట్రైలర్లోని డైలాగులు విపరీతంగా వైరల్(Viral) అవుతున్నాయి.
—————————-
Please tell us what is wrong. Your report will be sent to the website team.
