* సాయంత్రం 4 వరకూ కొనసాగిన సోదాలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Dil Raju) నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఉదయం 6 గంటలకు మొదలుపెట్టిన సోదాలను అధికారులు సాయంత్రం 4 వరకూ కొనసాగిస్తూనే ఉన్నారు. దిల్ రాజుకు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. సోదాల మధ్యలో ఒక బృందం దిల్ రాజు భార్య తేజ్వసిని బ్యాంకుకు తీసుకెళ్లారు. బ్యాంకులోని లాకర్లను అధికారులకు తెరిచి చూపించారు. ఐటీ అధికారులు(It Officers) బ్యాంకు ఖాతా వివరాలను అడిగినట్లు దిల్ రాజు భార్య తేజస్విని(Dil Raju Wife Tejaswini) తెలిపారు. ఐటీ సోదాలు సాధారణంగా జరిగేవే అని వెల్లడించారు.
…………………………………………….