* రైలును నిలిపి ఆందోళన
* ప్రయాణికులను అరెస్ట్ చేసిన పోలీసులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రైళ్ల ఆలస్యాన్ని(Trains Delay) నిరసిస్తూ లింగంపల్లిలో ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. చిత్తాపూర్ ఎక్స్ ప్రెస్(Chithapur Express)ను సరైన సమయంలో నడపాలని డిమాండ్ చేశారు. రైలు రోజూ 4 గంటలు ఆలస్యంగా వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైలు ఆలస్యం వల్ల ఉద్యోగాలకు వెళ్లేవారికి ఇబ్బంది అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. లింగంపల్లి రైల్వేస్టేషన్(Lingampalli Railway Station)లో రైలును నిలిపి తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన చేపట్టిన ప్రయాణికులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.
…………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
