* డోనాల్డ్ ట్రంప్ విక్టరీ సందేశం
* రిపబ్లికన్ పార్టీ స్టార్ ఎలాన్ మస్క్ అని వెల్లడి
ఆకేరు న్యూస్ డెస్క్ : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడి(America President)గా రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్(Donald Trump) దాదాఫు ఖరారయ్యారు. ఇక ప్రకటనే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ట్రంప్ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఫ్లోరిడా(Florida)లోని పామ్ బీచ్‌లో ఆయన మాట్లాడారు. అమెరికా చరిత్రలో ఇది స్వర్ణయుగం అని, అద్భుత విజయం ఇచ్చిన అమెరికా ప్రజలకే ఇది చెందుతుందని తెలిపారు. అమెరికా బంగారు భవిష్యత్ కు తనది పూచీ అని డొనల్డ్ ట్రంప్ చెప్పారు. అమెరికా ప్రజల కోసం నిత్యం పనిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు. తన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు(Thanks) చెప్పారు. ఈ ఎన్నికల్లో ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్(Elon Mask) స్టార్ గా నిలిచారని కొనియాడారు. దేశానికి జరిగిన గాయాలకు చికిత్స చేయనున్నట్లు ట్రంప్ తెలిపారు. బోర్డర్ సమస్యలను పరిష్కరించనున్నట్లు వెల్లడించారు. ట్రంప్ ప్రసంగం సమయంలో స్టేజ్‌పై ఆయన భార్య మెలానియా ట్ంరప్, ఉపాధ్యక్ష రేసులో నిలిచిన జేడీ వాన్స్, ప్రచార సిబ్బంది కూడా ఉన్నారు. 45వతో పాటు 47వ దేశాధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు థ్యాంక్స్ తెలిపారు.
…………………………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
