
ఆకేరు న్యూస్ , కమలాపూర్ : మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ జన్మదిన వేడుకలు గురువారం కమలాపూర్ లో బిజెపి శ్రేణులు ఘనంగా జరిపారు.బీజేపీ మండల అధ్యక్షుడు ర్యాకం శ్రీనివాస్ ఆధ్వర్యంలో బిజేపీ నాయకులు కమలాపూర్ లోని ఈటెల స్వగృహంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. అనంతరం స్థానిక సామాజిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈటెల రాజేందర్ ఆయురారోగ్యాలతో ప్రజలకు మరిన్ని సేవలు చేయాలని బీజేపీ నాయకులు ఆకాంక్షించారు.కార్యక్రమంలో బిజేపీ నాయకులు కట్కురి అశోక్ రెడ్డి,తుమ్మ శోభన్ బాబు,కనుకుంట్ల అరవింద్,బండి కోటేశ్వర్వ,వలిగే సాంబరావు, మౌటం రమేష్ బాబు, మౌటం అశోక్, మండ అశోక్, శనిగరపు సంపత్, తోట జయశంకర్, వారికోలు రాజేందర్, చేరిపెల్లి రాజు, మహేందర్, కొండమిది భిక్షపతి, కాటమల్ల రాజేశ్వర్ రావు,పుల్ల సంజీవ్,ఓస్కుల రత్నం తదితరులు పాల్గొన్నారు.
………………………………………..