* సంచలన నిర్ణయం తీసుకున్న ఏపీ మాజీ సీఎం
ఆకేరున్యూస్, తిరుమల: ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు. డిక్లరేషన్ అంశంపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలిపారు. శ్రీవారి లడ్డూ వివాదం నేపథ్యంలో తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని మాజీ సీఎం వైఎస్ జగన్ నిర్ణయించుకున్నారు. వైసీపీ ఈ ప్రకటన చేసినప్పటి నుంచి దీనిపై వివాదం మొదలైంది. అన్య మతస్తుడు కావడంతో వైఎస్ జగన్ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతనే తిరుమలలో అడుగుపెట్టాలని కూటమి నేతలు, హిందూ సంఘాలు డిమాండ్ చేయగా.. వైసీపీ నేతలు మాత్రం దీన్ని వ్యతిరేకించారు. ముఖ్యమంత్రి హోదాలో ఐదేళ్లు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన వ్యక్తిని డిక్లరేషన్ ఎలా అడుగుతారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించడమే కాక.. జగన్ డిక్లరేషన్ ఇవ్వరని.. ఇందులో రాజకీయ కోణం ఉందని ఆరోపించారు. ఇలా అనవసర రాద్దాంతం జరుగుతుండటంతో తన తిరుమల పర్యటనను జగన్ వాయిదా వేసుకున్నారు.
……………………………..