రోడ్డుపై నిరసన తెలుపుతున్న బాధితులు
* టీఆర్ నంబర్ లేకుండానే వాహనం డెలివరీ
* వాహనం కొన్న వారం రోజులకే యజమాని మృతి
* ఇన్సూరెన్స్ క్లెయిమ్ నిరాకరణ
ఆకేరు న్యూస్, జనగామ : కొత్త వాహనం కొనుగోలు చేసిన వారం రోజులకే జరిగిన రోడ్డు ప్రమాదంలో యజమాని మృతి చెందాడు. ఆ వాహనానికి తాత్కాలిక రిజిస్ట్రేషన్ (TR) నంబర్ లేకపోవడంతో ఇన్సూరెన్స్ క్లెయిమ్ తిరస్కరణకు గురైందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
* శ్రీనివాస హోండా షోరూంపై కుటుంబ సభ్యుల ఆగ్రహం..
ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన మృతుడి కుటుంబ సభ్యులు జనగామలోని శ్రీనివాస హోండా షోరూం (Jangaon Honda Showroom) ఎదుట ఆందోళనకు దిగారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐల వెంకటేశ్వర్లు ఇటీవల శ్రీనివాస హోండా షోరూంలో కొత్త వాహనం కొనుగోలు చేశారు. అయితే వాహనం కొనుగోలు చేసిన వారం రోజులకే రోడ్డు ప్రమాదం జరగడంతో వెంకటేశ్వర్లు మృతి చెందారు. దీంతో కుటుంబంలో విషాదం నెలకొంది.
* టీఆర్ నంబర్ లేకపోవడంతో ఇన్సూరెన్స్ సమస్య..
షోరూం నిర్వాహకులు టీఆర్ నంబర్ కేటాయించకుండానే కొత్త వాహనాన్ని డెలివరీ చేశారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం ప్రయత్నించారు. టీఆర్ నంబర్ లేకపోవడంతో క్లెయిమ్ తిరస్కరణకు గురైందని వారు చెబుతున్నారు.
వాహనం కొనుగోలు సమయంలోనే రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయాల్సిన బాధ్యత షోరూం (Jangaon Honda Showroom) నిర్వాహకులపై ఉందని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మృతుడి కుటుంబ సభ్యులు జనగామలోని శ్రీనివాస హోండా షోరూం ఎదుట రోడ్డుపై నిరసనకు దిగారు.
* న్యాయం చేయాలని నిరసన..
తమకు న్యాయం చేయాలని, షోరూం నిర్వాహకులు బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. వాహనం డెలివరీ సమయంలో రిజిస్ట్రేషన్ నంబర్ ఎందుకు కేటాయించలేదో స్పష్టం చేయాలని కోరారు.
Also Read : పాతబస్తీలో డ్రగ్స్ కలకలం..!

Please tell us what is wrong. Your report will be sent to the website team.

