Hyderabad CP Mahesh Bhagwat
* డ్రగ్స్‌పై సీపీ కీలక వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : పాతబస్తీలో డ్రగ్స్ వినియోగం (Old City Drugs Problem) , మొబైల్ ఫోన్ల స్నాచింగ్ ప్రధాన సమస్యలుగా ఉన్నాయని సీపీ మహేష్ భగవత్ వెల్లడించారు. ఈ అంశాలపై పోలీసులకు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు. శనివారం పురానీ హవేలీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
పాతబస్తీలో డ్రగ్స్ వినియోగంపై (Old City Drugs Problem) ప్రత్యేక దృష్టి సారించినట్లు సీపీ తెలిపారు. డ్రగ్స్‌తో పాటు మొబైల్ ఫోన్ల స్నాచింగ్ ఘటనలను ప్రధాన సమస్యలుగా గుర్తించినట్లు చెప్పారు. ఈ సమస్యల నియంత్రణకు పోలీసులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు.
ఇతర ప్రాంతాలతో పోలిస్తే పాతబస్తీలో హత్యల సంఖ్య తక్కువగా ఉందని మహేష్ భగవత్ పేర్కొన్నారు. రౌడీషీటర్లపై నిఘా పెంచడంతో పాటు, కేసుల్లో సాక్షులకు రక్షణ కల్పించి నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
* 112కు ఫిర్యాదు చేయండి..
ప్రజలు తమ పరిసరాల్లో అనుమానాస్పద కార్యకలాపాలను గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సీపీ సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 112 నంబర్‌కు కాల్ చేయాలని, సోషల్ మీడియా ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. పాతబస్తీలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.
Also Read : పిఠాపురంలో అపోలో ఆరంభ్ ప్రారంభం..!

Please tell us what is wrong. Your report will be sent to the website team.

