బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే
ఆకేరు న్యూస్, జయశంకర్ భూపాలపల్లి : పోలీసులు ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే (Kiran Khare) అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదివాస్ (Praja Divas) కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఆయా మండలాల నుంచి వచ్చిన బాధితుల నుంచి 19 ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు వివిధ సమస్యలతో పోలీసు స్టేషన్ కు వచ్చినప్పుడు, తక్షణమే స్పందించి న్యాయం జరిగేలా చేసినప్పుడే పోలీసులపై నమ్మకం కలుగుతుందని అన్నారు. బాధితుల ఫిర్యాదులపై విచారణ జరిపి, సాధ్యమైనంత త్వరగా సమస్యలు పరిష్కరించాలని సంబధిత పోలిసు అధికారులను ఆదేశించారు.
———————————————
Please tell us what is wrong. Your report will be sent to the website team.
