పదవీ విరమణ చేస్తున్న పోలీస్ అధికారులకు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సత్కారం.
ఆకేరు న్యూస్, వరంగల్ : పదవీ విరమణ అనంతరం పోలీసులు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా (Ambar Kishor Jha) సూచించారు. వరంగల్ పోలీస్ విభాగంలో సుధీర్ఘకాలంగా విధులు నిర్వహించి సోమవారం పదవీ విరమణ చేస్తున్న పోలీస్ అధికారులను కమిషనర్ ఘనంగా సత్కరించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ (Warangal Police Commissionerate) కార్యాలయంలో పోలీస్ అధికారుల సంఘం అధ్వర్యంలో ఏర్పాటు చేసిన పదవీ విరమణ కార్యక్రమానికి వరంగల్ పోలీస్ కమిషనర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. పదవీ విరమణ చేస్తున్న ఎస్.ఐలు వెంకటేశ్వర్లు, రవి, యాదగిరి, ఎ.ఎస్.ఐ లు సాంబయ్య, ప్రభాకర్ లను ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేసారు. ఈ సందర్బంగా వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ సుదీర్ఘ కాలంగా పోలీస్ శాఖలో పని చేస్తూ క్లిష్ట సమయాల్లో విధులు నిర్వహించి నేడు శాంతియుతమైన వాతావరణం కల్పించడంలో వీరు ప్రధాన కారకులని, నేటి తరం పోలీసులకు స్పూర్తిగా నిలుస్తారని అన్నారు. ముఖ్యంగా పోలీసులు తమ విధుల్లో రాణించడానికి ప్రధాన కారణం వారి కుటుంబ సభ్యులని, వారు ఇచ్చిన సహకారంతోనే పోలీసులకు అప్పగించిన పనుల్లో రాణిస్తున్నారని తెలియజేసారు. ఈ కార్యక్రమములో అదనపు డీసీపీ సురేష్కుమార్,స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ జితేందర్, ఆర్.ఐలు శ్రీధర్,చంద్రశేకర్, ఆర్.ఎస్.ఐ శ్రవణ్ కుమార్, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు శోభన్కుమార్తో పాటు పదవీవిరమణ పోందిన పోలీస్ అధికారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
——————————–
Please tell us what is wrong. Your report will be sent to the website team.
