YS Jagan Mohan Reddy AP drought rainfall deficit
* కుంభకర్ణుడి నిద్ర నటిస్తున్న చంద్రబాబు
* ఏ జిల్లా చూసినా లోటు వర్షపాతమే
* రైతులను, రైతు కూలీలను ఆదుకోరా?
* నా సవాల్‌కు సర్కారు వెనుకడుగు
* వైసీపీ చీఫ్ జగన్ సంచలన కామెంట్లు
ఆకేరు న్యూస్, అమరావతి : ఆంధ్రప్రదేశ్ తీవ్ర కరువులో ఉందని, లోటు వర్షపాతంతో అల్లాడుతోందని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. అయినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుంభకర్ణుడి నిద్ర నటిస్తున్నారని విమర్శించారు. రైతులను, రైతు కూలీలను, ప్రజలను ఆదుకోరా? అని ప్రశ్నించారు. తాడేపల్లిలోని తన నివాసంలో జగన్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు.
* నా ప్రశ్నలకు సమాధానాలు ఏవి?
గత వారంలో డీఎస్సీ, ఏపీపీఎస్సీ అంశాలపై వాస్తవాలను ప్రజల ముందు పెట్టానని, తాను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చంద్రబాబుగారు చెప్పలేదని అన్నీరు. డీఎస్సీపై సీబీఐ విచారణకు ప్రభుత్వం ముందుకు రాలేదన్నారు. ఇవాళ రాష్ట్రాన్ని కరువు కాటేస్తున్నా చంద్రబాబు కళ్లు తెరవడం లేదని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షపాతం 52 శాతం లోటు వర్షపాతం ఉందన్నారు. కోస్తాంధ్రలో మైనస్ – 47 శాతం, రాయలసీమలో మైనస్ – 52 శాతం వర్షపాతం లోటు కనిపిస్తోందని వివరించారు. ఏ జిల్లా చూసినా లోటు వర్షపాతమే అన్నారు. కానీ ఈ వెన్నుపోటు పార్టీ నాయకుడు మాత్రం కుంభకర్ణుడిని తలపిస్తూ నిద్రలేవడం లేదని విమర్శించారు.
* 625 మండలాల్లో లోటు వర్షపాతమే
రాష్ట్రంలో 688 మండలాలు ఉంటే, అందులో 625 మండలాల్లో లోటు వర్షపాతమే ఉందని, అంటే 91శాతం రాష్ట్రం లోటు వర్షపాతాన్నే ఎదుర్కొంటోందని జగన్ వివరించారు. 434 మండలాల్లో లోటు వర్షపాతం ఉంటే, మరో 191 మండలాల్లో ఈ పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయన్నారు. జిల్లాల పరంగా చూస్తే 28 జిల్లాలకు గానూ 25 జిల్లాల్లో లోటు వర్షపాతం ఉందని వివరించారు. నిత్యం కరువుతో ఇబ్బందిపడే రాయలసీమ ప్రాంతమే కాకుండా ఇప్పుడు కోస్తాలోకూడా అలాంటి పరిస్థితులే చూస్తున్నామని అన్నారు. చంద్రబాబు రాష్ట్రంలో కరువు పరిస్థితులను గుర్తించడానికి ఇష్టపడ్డం లేదని, రైతులను, ప్రజలను ఆదుకోవడానికి ముందుకు రావడం లేదని విమర్శించారు.
* అక్రమంగా లిఫ్ట్‌లు పెట్టినా..
మరోవైపు నాగార్జునసాగర్ కింద ప్రాంతాల్లోని వ్యవసాయం పరిస్థితి కూడా అలాగే ఉందని, నాగార్జున సాగర్ కుడికాల్వ నుంచైనా, ఇటు కృష్ణాడెల్టాప్రాంతానికైనా చంద్రబాబు ఒక్క చుక్క నీరు ఇవ్వడం లేదని అన్నారు. నాగార్జున సాగర్ కింద పులిచింతల వద్ద రెండు లిఫ్ట్‌లు అక్రమంగా లిఫ్ట్‌లు పెట్టి, పంపుహౌస్‌లు కడుతున్నా, చోద్యం చూస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో చింతలపాలెం మండలం పాత వెల్లటూరు వద్ద పులిచింతల ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ నుంచి 8 టీఎంసీలు తరలించడానికి రూ.1,450 కోట్లతో చేపట్టిన మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకం పంప్ హౌజ్ నిర్మాణం శరవేగంగా జరుగుతోందన్నారు.
* తప్పుడు ప్రచారాలు
చంద్రబాబు రాష్ట్రం అంతా తిరుగుతూ, తమపైన తప్పుడు ప్రచారాలు, అబద్ధాలు చెప్పడానికి దృష్టి పెడుతున్నాడు కాని, కరువు సమయంలో ప్రజలను ఎలా ఆదుకుంటాడో చెప్పడం లేదన్నారు. జూన్, జులై, ఆగస్టు, సెప్టెంబరు మాసాల్లోనే వర్షాలు పడతాయి, అప్పుడే ఖరీఫ్ నడుస్తోంది. అలాంటప్పుడు జూన్, జులైలోనే 52% లోటు వర్షపాతం కనిపించినప్పుడు కాంటిన్యుజెన్సీ ప్లాన్ ఆగస్టుకే అమల్లో ఉండాలి కదా? అన్నారు. ప్రతి జిల్లాలో డ్రాప్ట్ కాంటిన్జెన్సీ సెల్ ఏర్పాటు చేయాలని తెలిపారు.
* చంద్రబాబు బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్నారు
2019లో తాము వచ్చిన తర్వాత జీవో నంబర్-176 ఇచ్చి బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే ఎన్నికలకు సిద్ధం అయ్యామని జగన్ తెలిపారు. కానీ చంద్రబాబు తన పార్టీ నాయకుడు బిర్రు ప్రతాపరెడ్డి ద్వారా హైకోర్టులోనూ, సుప్రీంకోర్టులోనూ కేసు వేయించారని, సుప్రీంకోర్టు ఆదేశాలమేరకు రిజర్వేషన్లు 50 శాతం దాటుతున్నందుకు బీసీలకు 34 శాతం కొట్టేస్తున్నామని హైకోర్టు తీర్పు ఇచ్చిందని వెల్లడించారు. తెలిసికూడా మరోసారి మహాడ్రామాకు చంద్రబాబు దిగారని ఆరోపించారు. మళ్లీ కోర్టుకు పోయి అడ్డుకోవద్దంటూ కపటనాటకాలు ఆడుతున్నాడు. కోర్టుకు పోయేది ఆయనే, కొట్టివేయించేదీ ఆయనే, మళ్లీ దొంగ ఏడుపులు ఏడ్చేదీ ఆయనే అన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
