Jhansei Reddy Wedding Anniversary
* రాయపర్తిలో ఘనంగా ఝాన్సీ రెడ్డి – రాజేందర్ రెడ్డి దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు
ఆకేరు న్యూస్,రాయపర్తి:
రాయపర్తి మండల కేంద్రంలోని మండల పార్టీ కార్యాలయంలో
టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి – రాజేందర్ రెడ్డి దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు వేర్వేరుగా ఘనంగా నిర్వహించారు.
మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో మండల పార్టీ అధ్యక్షులు ఈదు లకంటి రవీందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హమ్యా నాయక్, తమ వర్గాల నాయకులతో కలిసి వేర్వేరుగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి, మరియు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హమ్యా నాయక్ వేర్వేరుగా మాట్లాడుతూ… నియోజకవర్గ అభివృద్ధికి, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఝాన్సీ రెడ్డి – రాజేందర్ రెడ్డి దంపతులు నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. వారి దంపతులు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో వారు చూపిస్తున్న చొరవ కార్యకర్తలకు ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ మండల, గ్రామ స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పత్రికలకు

Please tell us what is wrong. Your report will be sent to the website team.
