* పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహారావు
* కేయూ లైబ్రరీ ఎదుట నిరసన
ఆకేరున్యూస్, హన్మకొండ: రాష్ట్రంలోని గ్రూప్-1 నియామకాల భర్తీలో జీవో 29ని వెంటనే రద్దు చేయాలని పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీ నరసింహారావు డిమాండ్ చేశారు. పాత జీవో 55 పునరుద్ధరించి, దాని ప్రకారమే ఉద్యోగాలు భర్తీ చేయాలని బుధవారం కాకతీయ యూనివర్సిటీ లైబ్రరీ ఎదుట ప్లకార్డులతో పీడీఎస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రేవంత్రెడ్డి ప్రభుత్వం రాజకీయ బేషజాలాలకు పోకుండా గ్రూప్-1 అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేయడానికి వెంటనే అభ్యర్థులతో చర్చలు జరపాలని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లింల ఉద్యోగావకాశాలను దెబ్బతీయాలని చూస్తే రేవంత్రెడ్డి సరారు తీవ్ర పరిణామాలను ఎదురోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కేయూ పీడీఎస్యూ నాయకులు అశోక్, నరేశ్, చరణ్, వీరన్న, సూర్య, స్వాతి, పృథ్వీరాజ్, సంగీత, అనూష ఉన్నారు.
……………………………………….