Published:
Updated: 24 Oct 2024 • 04:04 AM
* నాగర్ కర్నూల్లో షాకింగ్ ఘటన
ఆకేరున్యూస్, డెస్క్: రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. గొంతులో దోశ ఇరుక్కొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో బుధవారం చోటు చేసుకుంది. కల్వకుర్తికి చెందిన వెంటకయ్య మద్యం సేవించిన అనంతరం దోశ తిన్నాడు. దోశ తింటుండగా.. గొంతులో ఇరుక్కుకపోవడంతో ఊపిరాడలేదు. కొద్దిసేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో స్థానికులు అతన్ని వెంటనే ఆసుప్రతికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
………………………………………
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
