– పోటీలను ప్రారంభించిన ఉమ్మడి వరంగల్ జిల్లా ఎం జె పి గురుకులాల రీజినల్ కోఆర్డినేటర్ మోతె రాజ్ కుమార్.
ఆకేరు న్యూస్ , కమలాపూర్ : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలో ఆదివారం ఉదయం ఉమ్మడి వరంగల్ జిల్లా అండర్-14,19 విభాగంలో బాలికల క్రీడా పోటీలను ఉమ్మడి వరంగల్ జిల్లా ఎం జె పి గురుకుల రీజనల్ కోఆర్డినేటర్ మోతె రాజ్ కుమార్ ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా పాఠశాలలోని ఎన్ సీ సీ విద్యార్థినులు ఆర్ సి ఓ రాజ్ కుమార్ కి గౌరవ వందనాన్ని సమర్పించి ఘనంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఆర్సీఓ మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, శారీరక దృఢత్వాన్ని అందిస్తాయని అన్నారు. బాలికలు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని చాటాలన్నారు. క్రీడాజ్యోతి ప్రజ్వలన చేసి క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి వచ్చిన వివిధ పాఠశాలల క్రీడాకారులు మార్చ్ ఫాస్ట్ చేశారు. అనంతరం క్రీడా ప్రతిజ్ఞ చేశారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ క్రీడా పోటీలలో 18 పాఠశాలల విద్యార్థినులు,06 క్యాంపస్ కళాశాలల నుంచి దాదాపు 840 మంది విద్యార్థినులు పాల్గొననున్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ సౌజన్య, డాక్టర్ తాడూరి రవీందర్, శోభారాణి, పీడీ లు, పీఈటీ లు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.
……………………………………….