* వైఎస్ షర్మిలపై విజయసాయిరెడ్డి ఫైర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయమ్మ కన్నీళ్లు తుడిచేందుకు కాదని, చంద్రబాబు కళ్లలో ఆనందం చూడడానికి వైఎస్ షర్మిల(YS SHARMILA) పనిచేస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి(YCP MP Vijayasai Reddy) ఆరోపించారు. ఆస్తి కోసం కాదని, అధికారం కోసమే ఆమె తపనని అన్నారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. దొంగ సంతకాలతో షర్మిల షేర్లు ట్రాన్స్ ఫర్ చేసుకున్నారని ఆరోపించారు. జగన్ మళ్లీ సీఎం పీఠం అధిరోహించకూడదు అనే ఉద్దేశంతో జగన్ (YS Jagan) తప్ప ఇంకేవరైనా సీఎం పదవి పరవలేదన్న చంద్రబాబు ఇచ్చిన ఎజెండాతో ముందుకు వెళుతున్నారని షర్మిలపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్నప్పటికీ షర్మిల చంద్రబాబుతో, ఎన్డీయేతో లాలూచి పడి జగన్‌పై వ్యతిరేకంగా పనిచేస్తున్న దాంట్లో సందేహం లేదని పేర్కొన్నారు. చెల్లెలుపై ప్రేమతో ఆస్తులు రాసిస్తే షర్మిల రిటర్న్ గిఫ్ట్‌గా బాబుతో లాలూచీ పడి జగన్‌ను వంచించారని, జగన్‌ను జైలుకు పంపడమే చంద్రబాబు, షర్మిల లక్ష్యమని ఆరోపించారు. జగన్ తప్పా, ఎవరు సీఎం అయినా పర్వాలేదన్న రీతిలో షర్మిల వ్యవహరిస్తున్నారని అన్నారు.
……………………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
