* ఎగ్జిట్ పోల్స్ అన్నీ అటువైపే
* గట్టి పోటీనిచ్చిన బీఆర్ ఎస్
* ఫుల్ కాన్ఫిడెన్స్ లో టీపీసీసీ చీఫ్
ఆకేరు న్యూస్, ప్రత్యేక ప్రతినిధి : తీవ్ర ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. దాదాపు 50 శాతం జరిగినట్లు తెలుస్తోంది. అధికారికంగా ఇంకా వెల్లడి కాలేదు. రేవంత్ వర్సెస్ కేటీఆర్ అన్నట్లుగా సాగిన ఈ హోరాహోరీ ఉప ఎన్నికలో ప్రజలు కాంగ్రెస్ వైపే నిలిచినట్లుగా ఎగ్జిట్ పోల్సీ వెల్లడించాయి. బీఆర్ ఎస్ గట్టి పోటీ ఇచ్చినా అక్కడ ఎమ్మెల్యేగా గెలవబోయేది నవీన్ యాదవ్ అనే ప్రచారం జరుగుతోంది. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ సంస్థలు ఆయన వైపే నిలిచాయి. కంటోన్మెంట్ మాదిరిగానే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ జెండా ఎరగబోతోందని తెలుస్తోంది. ఎంఐఎం బహిరంగ మద్దతు, ఆరు గ్యారెంటీలు, 30 శాతం మంది ముస్లింలు ఉండడం కాంగ్రెస్ కు కలిసి వచ్చిన అంశాలుగా తెలుస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ కూడా కాంగ్రెస్ గెలుపుపై ధీమాగా ఉన్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో విజయం సాధించామని అన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారని స్పష్టం చేశారు. కాగా, బీఆర్ ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతితో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ భార్య సునీత, కాంగ్రెస్ తరపున నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్‌రెడ్డి పోటీ చేశారు. ఈ ఎన్నికలో బీజేపీ నామమాత్రపు పోటీ కూడా ఇవ్వలేకపోయిందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ద్వారా స్పష్టం అవుతోంది. అసలు ఫలితాలు నవంబరు 14న రానున్నాయి.
కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇలా..
* హెచ్ ఎంఆర్ (HMR) సర్వే : కాంగ్రెస్‌కు 48.31 శాతం, బీఆర్ఎస్కు 43.18 శాతం, బీజేపీ 5.84శాతం ఓట్లు
* చాణక్య స్ట్రాటజీస్ సంస్థ : కాంగ్రెస్‌కు 46శాతం, బీఆర్ఎస్కు 43 శాతం, బీజేపీకి 6 శాతం
* స్మార్ట్ పోల్ సర్వే : కాంగ్రెస్‌కు 48.2శాతం, BRSకు 42.1 శాతం, BJPకి 7.6 శాతం
* చాణక్య ముఖేష్ సర్వే : పోలింగ్ కు ముందు వరకు బీఆర్ఎస్ గెలుస్తుందని తెలిపిన ముఖేష్ సర్వే కూడా తాజాగా కాంగ్రెస్‌కే జై కొట్టడం గమనార్హం.
……………………………………………..
