ఆకేరు న్యూస్, హైదరాబాద్ : చిక్కుల్లో ఉన్న భూమిని కొనుగోలు చేసి వివాదాల్లో చిక్కుకున్నారు ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్. ఈకేసులో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 75 లో ఉన్న ఓ ప్లాట్ ను 2003లో గీత లక్ష్మీ అనే మహిళ నుంచి ఎన్టీఆర్ కొనుగోలు చేశారు. అయితే అప్పటికే 1996 నుండి పలు బ్యాంకుల వద్ద ఇదే ప్రాపర్టీ మీద గీతలక్ష్మి కుటుంబం మార్ట్ గేజ్ లోన్స్ తీసుకున్నారు. మూడు నాలుగు బ్యాంక్ ల నుంచి ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టీ లోన్ తీసుకుంది గీత లక్ష్మీ. ఈ విషయాలను దాచిపెట్టి.., జూనియర్ ఎన్టీఆర్ కు గీత భూమిని అమ్మేశారు. ఐదు బ్యాంకుల నుండి ఇదే డాక్యుమెంట్ మీద లోన్స్ తీసుకుంది గీత లక్ష్మి. కేవలం ఒక్క బ్యాంకులో మాత్రమే మార్ట్ గేజ్ లోన్ ఉన్నట్లు ఎన్టీఆర్ కు చెప్పింది. చెన్నై లో ఒక బ్యాంక్ లో లోన్ క్లియర్ చేసి డాక్యుమెంట్ తీసుకున్నారు తారక్. 2003 నుండి ప్లాట్ ఒనర్ గా తారక్ ఉన్నారు. అప్పటినుండి పలు బ్యాంకు మేనేజర్లతో వివాదం కొనసాగుతుంది. గీత లక్ష్మి తీసుకున్న లోన్లు తీర్చలేని కారణంగా భూమిని స్వాధీనం చేసుకునేందుకు మేనేజర్లు ప్రయత్నించారు. దీనిపై బ్యాంకు మేనేజర్లపై ఎన్టీఆర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు తాజాగా హైకోర్టును ఆశ్రయించారు.
————