* లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే శిక్ష తప్పదు
* 15 మంది మైనర్లు జువైనైల్ హోం కు తరలిం పు
* ప్రత్యేక తనిఖీల్లో మైనర్ల గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు
అకేరు న్యూస్ ,వరంగల్ క్రైం :
మీ పిల్లలకూ మైనారిటీ తీరకుండానే ద్విచక్రవాహనాలు నడిపే అవకాశం ఇస్తున్నారా..?
పిల్లలు వాహనాలు నడిపితే జైలు శిక్షలు తప్పేలా లేవు. పిల్లలు భవిష్యత్తును మీరే స్వయంగా పాడు చేసే దుస్థితి తెచ్చుకోవద్దని ట్రాఫిక్ ఏసిపి సత్యనారాయణ అంటున్నారు.
ఎలాంటి లైసెన్స్ లు లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న 15మంది మైనర్ డ్రైవర్లను జువనైల్ హోమ్ కి తరలించాలించాలని వరంగల్ కోర్టు తీర్పు ఇచ్చింది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో ఎలాంటి లైసెన్స్ లు లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న 38 మంది మైనర్ డ్రైవర్లు గుర్తించారు. వారిని న్యాయమూర్తి ముందు హాజరు పరచగా 15 మంది మైనర్ డ్రైవర్లకు ఒక రోజు జువనైల్ హోం కు తరలించాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశించారు. మరికొద్ది మందికి జరిమానాలు విధించారని ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ వెల్లడించారు. గత ఏడాది కాలంగా ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో ఇప్పటి వరకు 113మంది మైనర్ డ్రైవర్ల ను జువనైల్ హోమ్ కి తరలించడం జరిగిందని ట్రాఫిక్ ఏసిపి సత్యనారాయణ తెలియజేశారు. ఇకనైనా వాహనదారులు తమ పిల్లల యోగక్షేమాలతోపాటు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాహనాలు ఇవ్వకూడదన్నారు . ఇదే విదంగా కొనసాగితే మైనర్ డ్రైవర్లతో పాటు తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడుతాయని ట్రాఫిక్ ఏసీపీ హెచ్చరించారు.
——————————-