Bakrid Greetings By MLA KADIYAM SRI HARI
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
హజ్రత్ ఇబ్రహీం త్యాగానికి ప్రతీకగా నిర్వహించుకునే బక్రీద్ (ఈద్-ఉల్-అదా) పర్వదినం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఈద్ ముబారక్ తెలిపారు. హనుమకొండలోని ఆయన నివాసంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వార్థం, అసూయ, రాగద్వేషాలను విడిచిపెట్టి మానవుల్లో త్యాగాన్ని వ్యాపింపచేయడమే బక్రీద్ పండుగ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. త్యాగబుద్ధిని, నిజమైన భక్తిప్రపత్తులు కలిగి ఉన్నవారే దైవకృపకు పాత్రులు అవుతారు అనే సూక్తిని బక్రీద్ మనకు తెలియజేస్తోందని అన్నారు. నేటి ఆధునిక కాలంలో సాటి మనిషిని ప్రేమించేవారే నిజమైన దైవభక్తులుగా పరిగణించబడతారని వెల్లడించారు. హజ్రత్ ఇబ్రహీం స్ఫూర్తిగా అందరూ సాటివారిని ఆదరిస్తూ సహృదయంతో ముందుకు సాగాలని తెలిపారు. అల్లా ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
